
జేసీబీ, లారీ సీజ్
ములకలపల్లి: అనుమతుల్లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు బుధవారం సీజ్ చేశారు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని వీకే. రామవరం శివారు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో తెల్లవారుజామున దాడులు నిర్వహించి జేసీబీ, లారీని సీజ్ చేశారు. వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.
గూడ్స్ రైలు ఢీకొని అడవి దున్న మృతి
అశ్వాపురం: అశ్వాపురం రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 159 పరిధి మండలంలోని జగ్గారం గ్రామంలో షెడ్యూల్–1 జాతికి చెందిన సుమారు ఐదేళ్ల వయసు కలిగిన అడవి దున్న మంగళవారం రాత్రి రైల్వే ట్రాక్ దాటుతూ గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందింది. ఎఫ్‌ఆర్‌ఓ రమేష్, ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పశువైద్యాధికారి రుబీనా ఫర్హీన్ పోస్టుమార్టం నిర్వహించగా, రైల్వే అధికారులు పంచనామా నిర్వహించారు.
పశువుల వాహనం బోల్తా
భద్రాచలంఅర్బన్: అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాన్ని బుధవారం ఉదయం 4 గంటల సమయంలో కరకట్టపై నిలిపి ఉంచగా, ప్రమాదవశాత్తు అక్కడి నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ ఆవు మృతి చెందింది. మరో ఆవు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు పడిపోయిన వాహనాన్ని లేపి పశువులను రక్షించారు.

జేసీబీ, లారీ సీజ్

జేసీబీ, లారీ సీజ్