
అటవీ భూమి ఆక్రమణకు అడ్డుకట్ట
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం రేంజ్ పరిధి ములకలపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని పర్ణశాల సౌత్‌లోని 17 హెక్టార్ల అటవీ భూమిని గడ్డోరగట్ట గ్రామస్తులు ఆక్రమించడానికి యత్నించగా ఎఫ్‌డీఓ సుజాత ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం అడ్డుకున్నా రు. ఈ 17 హెక్టార్ల భూమిలో 2023–24లో అటవీశాఖ మారుజాతి మొక్కల ప్లాంటేషన్ చేసింది. ఆ భూమిలోకి గడ్డోరగట్ట గ్రామస్తులు చొరబడి మొక్కలను కాలుస్తుండగా గతంలోనే వారిపై కేసు నమో దు కాగా.. ప్రస్తుతం కేసు హైకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 12న ప్లాంటేషన్ లోపలకి మళ్లీ అక్రమంగా ప్రవేశించి మొక్కలను నరికి పెద్ద చెట్లను కాలుస్తుండగా అటవీశాఖ సిబ్బంది అడ్డుకుని విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఓ సూచించారు. మంగళవారం ప్లాంటేషన్‌లోకి గ్రామస్తులు రాగా అటవీశాఖ సిబ్బంది అడ్డుకున్నారు. ఎఫ్‌డీఓ మాట్లాడు తూ.. అటవీశాఖ ప్లాంటేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించి చెట్ల నరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.