
అందరి చూపూ ఖమ్మం వైపే..
● ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేస్తున్న ముగ్గురు మంత్రులు ● ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి ● రూ.2.40 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
అశ్వారావుపేటరూరల్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారంతా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపే చూస్తున్నారని, ఇక్కడి ముగ్గురు మంత్రులు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందుకు కారణమని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి అశ్వారావుపేట, దట్టమైన అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. తొలుత మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంలో రూ. 1.32 కోట్లు, ఎమ్మెల్యే దత్తత గ్రామమైన చెన్నాపురంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన 25 సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం కావడిగుండ్ల, చెన్నాపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా అభివృద్ధి చేయడమే తన అజెండా అని అన్నారు. నియోజకవర్గంలో రూ.97 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే దత్తత గ్రామాన్ని సోలార్ గ్రామంగా మార్చుతానని, ప్రణాళికలు రూపొందించాలని ఎంపీడీఓ, ఐకేపీ అధికారులకు సూచించారు. పిల్లలను విద్యకు దూరం చేయవద్దని, బడి మానేస్తే తిరిగి చేర్పించాలని లేని పక్షంలో మీ గ్రామంలో అభివృద్ధి నిలిపేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వనం కృష్ణ ప్రసాద్, డాక్టర్ ప్రదీప్ కుమార్, ప్రవీణ్‌కుమార్, శ్రీధర్, అక్షిత, ప్రకాశ్, సీఐ నాగరాజు, ఎస్సై య యాతి రాజు, సొసైటీ చైర్మన్ సీహెచ్ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మా రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, అల్లాడి రామారావు, మిండా హరి, నార్లపాటి దివాకర్, కర్నాటి శ్రీను పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆది నారాయణ అన్నారు. సోమవారం అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సుల సేవలకు వెలకట్టలేమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మా రాంబాబు, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండ్ డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ విజయ్‌కుమార్, స్టాప్ నర్సు ప్రమీలరాణి, వీరాకుమారి, సుజాత, స్వరూప, సిబ్బంది పాల్గొన్నారు.