
గాయపడ్డ బాలుడికి చికిత్స
భద్రాచలంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా డొంకరాయికి చెందిన బాలు డు సృజన్ రెడ్డికి భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 8న బైక్ ఆవును ఢీకొన్న ఘటనలో బాలుడు ఎడమ కన్ను పైభాగంలో తీవ్ర గాయాలయ్యా యి. దీంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా, డాక్టర్లు కుట్లు వేసి చికిత్స అంది స్తున్నారు. బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లు సీజ్
బూర్గంపాడు: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. కిన్నెరసాని నుంచి ఇసుక తరలిస్తుండగా సంజీవరెడ్డిపాలెం గ్రామం వద్ద పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ యజమానులపై, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వరకట్న వేధింపుల కేసు నమోదు
పాల్వంచరూరల్: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్త, మామలపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన మోత్కూరి మాధవికి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన రమణాచారితో 2014లో వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. కొంతకాలంగా భర్తతోపాటు అత్త అనసూర్య, మామ వెంకటేశ్వర్లు అదనపు కట్నం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.