
నాలుగో తరగతి ఉద్యోగుల కమిటీ ఎన్నిక
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కంభంపాటి రమణ(పాలిటెక్నిక్), సహ అధ్యక్షుడిగా ఓ హరిబాబు(ఐసీడీఎస్), ఉపాధ్యక్షులుగా జి చంద్రశేఖర్(డీసీఓ ఆఫీస్), ఈ నవీన్ (డీటీఓ ఆఫీస్), కార్యదర్శిగా కె.దినేష్ (ఏఎస్‌డబ్ల్యూఓ ఆఫీస్), సంయుక్త కార్యదర్శులుగా ధనలక్ష్మి(డీసీఓ ఆఫీస్), కృష్ణ(ఆర్‌అండ్‌బీ), కోశాధికారిగా వి.నరేందర్(ఇరిగేషన్), కార్యనిర్వాహక కార్యదర్శిగా వి సుధాకర్(డీపీఓ ఆఫీస్), ప్రచార కార్యదర్శిగా కె.వెంకటేష్(ఉద్యానశాఖ), ఆఫీస్ కార్యదర్శిగా డి.రాము(డీపీఆర్‌ఓ ఆఫీస్), కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ కవిత (డీఎస్‌డీఓ ఆఫీస్), ఎస్.జయమ్మ(కొత్తగూడెం ఐటీఐ), విజయ(ల్యాండ్ సర్వే కార్యాలయం) ఎన్నికయ్యారు. సమావేశానికి కేంద్ర సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఖాదర్‌బిన్ హసన్, సహ అధ్యక్షుడు బి.రాజేందర్, కార్యదర్శి కె.కృష్ణవేణి, కోశాధికారి కె.ధన్‌రాజ్ హాజరయ్యారు. ఈ కమిటీ మూ డేళ్లపాటు కొనసాగుతుందని నాయకులు తెలిపా రు. అనంతరం అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌ను కలిసి నూతన కమిటీ వివరాలను వివరించారు.