
సాగులో మెళకువలపై అవగాహన
వైరారూరల్: ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగామండలంలోని ఖానాపురం రైతు వేదికలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈసందర్బంగా వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ మాట్లాడుతు యూరియా వాడకం తగ్గింపు, తద్వారానేల ఆరోగ్య పరిరక్షణపై వివరించారు. అనంతరం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య, వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ వివిధ అంశాలపై మాట్లాడారు.ఏఓ మయాన్ మంజుఖాన్, తల్లాడ వెటర్నరీ వైద్యులు అనాస్, విత్తన అభివృద్ధి అధికారి అక్షిత, ఏఈఓలు సపావత్ సైదులు, ఆలూరి వాసంతి, వెంపటి కీర్తి, మేడా రాజేష్, పరిటాల వెంకటనర్సయ్యతో పాటు నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రఫీ, షేక్ లాల్ మహ్మద్, తుమ్మల రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.