
●కశ్మీర్‌లోనే విధులు
పాల్వంచ మండలం జగన్నాధపురానికి చెందిన గిరిజనులు మాలోతు భగవాన్ – అమ్మి ప్రథమ కుమారుడు రవి ఇంటర్ చదివాక 20ఏళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. గతంలో శ్రీనగర్, మణిపూర్, కోల్‌కత్తా పనిచేయగా ప్రస్తుతం అస్సాంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యాన జమ్ముకశ్మీర్‌లో విధులు కేటాయించారు. ఈ సందర్భంగా తల్లి అమ్మి మాట్లాడుతూ యుద్ధం మొదలైనప్పటి నుంచి భయమేస్తున్నా దేశం కోసం పోరాడుతున్న కుమారుడిని చూస్తే గర్వంగా ఉంటుందని తెలిపారు. ప్రతీరోజు ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతామని పేర్కొన్నారు.