
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన తెల్లగొర్ల ప్రసన్న(20)పాల్వంచలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. నాలుగు రోజుల క్రితం పరీక్షలు రాసేందుకు పాల్వంచలోని కళాశాలకు వెళ్లింది. కాగా, పరీక్షలు వాయిదా పడటంతో తన తండ్రికి చెప్పగా, పరీక్షలు రాసిన తర్వాత ఇంటికి రావాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంటికి దూరం ఉండి చదువుకోవడం ఇష్టం లేక మనస్తాపం చెంది సోమవారం ఉదయం పాల్వంచ నుంచి ఇంటికి వచ్చేసింది. అప్పటికే తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి వెంకట రమణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.