అశ్వారావుపేటరూరల్: ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం టి.గంగన్నగూడెం గ్రామానికి చెందిన కొర్సా సత్తిబాబు (35), జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడేనికి చెందిన తన బావ మాదాసు శ్రీను కలిసి బైక్‌పై అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత పక్కనే ఉన్న సత్తిబాబు అత్తారింటికి వెళ్లి తిరిగి తమ గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన అమరవరపు మనోహర్ వినాయకపురం నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. రెండు బైక్‌లు తిరుమలకుంట శివారులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఎదురెదురుగా ఢీకొన్నాయి. సత్తిబాబు అక్కడికక్కడే మృతిచెందగా శ్రీను, మనోహర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
దుకాణాల్లోకి దూసుకెళ్లిన వాహనం
చర్ల: మండల కేంద్రంలోని గొల్లగట్ట సమీపంలో గల సూపర్‌బజార్‌లోని దుకాణాల్లోకి మ్యాజిక్ వాహనం దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అంబేడ్కర్ సెంటర్ వైపు నుంచి తహసీల్దార్ కార్యాలయం సెంటర్ వైపునకు వెళ్తున్న టాటా మ్యాజిక్ సూపర్‌బజార్ సెంటర్‌లోని ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్, ఎలక్ట్రికల్ రిపేరింగ్ దుకాణంలోకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో ఎలక్ట్రీషియన్ వాసు, చక్రమ్మ మరొకరికి గాయాలయ్యాయి. చక్రమ్మను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేని సీఐ రాజు వర్మ తెలిపారు.
ఒకరు దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ