బాపట్లటౌన్: ఏళ్ళ తరబడి ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం...ఎంతో మంది కక్షిదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్న మాపై కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అమానుషమని డాక్యుమెంట్ రైటర్ల సంఘం బాపట్ల అధ్యక్షులు కె. నారాయణరావు తెలిపారు. కూటమి సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 396 కు నిరసనగా శనివారం బాపట్లలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేశారు. తొలుత బాపట్ల సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షులు కె. నారాయణరావు మాట్లాడుతూ మేం ఏ ఒక్క కక్షిదారుడిని ఇబ్బందులకు గురిచేయటం లేదు. కక్షిదారుడికి సకాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేస్తున్నాం. అలాంటి మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ జారీ చేసిన జీవో 396ను రద్దు చేసేవరకు పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డాక్యుమెంట్ రైటర్ల సంక్షేమసంఘం సెక్రటరి టి. కొండలరావు, జాయింట్ సెక్రటరి టి. సంతోష్‌గోకుల్ గుప్తా, ట్రెజరర్ వి. సాయి శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.
జీవో నెంబర్ 396ను రద్దు చేయాలి


