శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

Jul 18 2026 3:23 AM | Updated on Jul 18 2026 3:23 AM

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

పర్చూరు(చినగంజాం): జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ హెచ్చరించారు. బాపట్ల సబ్‌ డివిజన్‌ పరిధిలోని పర్చూరు పోలీస్‌ స్టేషన్‌, మార్టూరు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ కార్యాలయ పరిసరాలను, వివిధ నేరాలలో సీజ్‌ చేసిన వాహనాలను ఆయన పరిశీలించారు. ప్రతి శనివారం రాష్ట్రమంతటా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రైమ్‌ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల వ్యవస్థను, సరిహద్దులను సూచించే మ్యాప్‌ను పరిశీలించారు. హెల్మెట్‌ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ నారాయణ, మార్టూరు రూరల్‌ సీఐ నాగభూషణం, పర్చూరు ఎస్‌ఐ పులి గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement