రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వేటపాలెం: రోడ్డుపై ఆగి ఉన్న బైక్‌ను వెనుక నుంచి మరో మోటార్‌ బైక్‌ ఢీకొన్న ఘటనలో వెనుక కూర్చుని ఉన్న వ్యక్తి మృతి చెందాడు. అక్కాయిపాలెం పంచాయతీ బైపాస్‌ రోడ్డు జక్షన్‌ దగ్గరలో ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. చీరాల వైపు నుంచి ఎస్‌.శ్రీనివాసరావు(50) తన స్నేహితుడి బైక్‌పై వేటపాలెం వైపు వస్తున్నాడు. అక్కాయిపాలెం వద్దకు వచ్చే సరికి రోడ్డుపై నిలిపి ఉన్న మరో బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టారు. బైక్‌ వెనుక కూర్చున్న శ్రీనివాసరావు రోడ్డుపై పడి మృతి చెందాడు. మృతుడు పర్చూరులో కోర్టులో ఉద్యోగం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement