ముస్లిం మహిళపై ఎమ్మెల్యే శ్రీధర్ వ్యాఖ్యలు సరికాదు బాపట్ల: జనసేన పార్టీ అధ్యక్షులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించటం సరికాదని ముస్లిం పెద్దలు, ప్రముఖ న్యాయవాది జమురుద్ బాషా శనివారం పేర్కొన్నారు. ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలతో ఇష్టమొచ్చినట్లు వ్యవహారిస్తున్న నాయకులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య గౌరవాధ్యక్షులు అల్లాబక్షి మాట్లాడుతూ ముస్లిం మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాపట్ల అంజుమన్ ఏ ఇస్లామీయ ప్రెసిడెంట్ షేక్ రహీమ్ జానీ, ప్రధాన కార్యదర్శి పటాన్ మొహమ్మద్ ఖాన్, మాజీ అంజుమాన్ ఎ ఇస్లామీయ ప్రెసిడెంట్ షేక్ జిలాని పాల్గొన్నారు.
ఫిల్మ్, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా కందిమళ్ల అక్షర ఆంధ్రా– ఉల్లాస్
విజయవంతం చేయాలి
గుంటూరు వెస్ట్: ‘అక్షర ఆంధ్రా– ఉల్లాస్’ విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ 2026– 27లో అక్షర ఉల్లాస్ ఆంధ్రా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని వయోజనులను శత శాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వంద గంటల కరిక్యులం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అందులో ఆడియో విజువల్ కంటెంట్, తరగతి గదులలో ప్రాక్టీస్ చేయిస్తారని వివరించారు. తరగతులను సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు స్థానిక అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎప్పటిలాగానే ప్రాథమిక పాఠ్యాంశాలు, సాధన పత్రాలు పంపిణీ చేస్తారన్నారు. 48 రకాల డిజిటల్ వీడియోలను కూడా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఫౌండేషన్ లెటర్స్ అండ్ న్యూమరసి కోర్స్(ఎఫ్.ఎల్.ఎన్.సి)ను నైపుణ్యం పెంచడం లక్ష్యంగా చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. 2026లో నిర్వహించిన ఎఫ్.ఎల్.ఎన్.సి. పరీక్షకు జిల్లా నుంచి 92,387 మంది హాజరు కాగా 92,235 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. సమావేశంలో వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు కె.ఆంజనేయులు, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లోచర్ల రమేష్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన పాల్గొన్నారు. గుంటూరు మెడికల్ కళాశాలకు రూ.2 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కళాశాల అభివృద్ధికి డాక్టర్ లలిత రూ.2 లక్షల విరాళం అందించారు. విశాఖపట్నంలోని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ లలిత, గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.వి. సుందరాచారిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ లలిత మాట్లాడుతూ 80 సంవత్సరాల చరిత్ర కలిగిన గుంటూరు మెడికల్ కాలేజీకి నా గురువు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కళాశాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ సుందరాచారి తమకు వైద్య విద్యతో పాటు విలువలు, నైపుణ్యాలను అద్భుతంగా బోధించారని కొనియాడారు. గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.వి. సుందరాచారి శాలువాతో డాక్టర్ లలితను సత్కరించారు.
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వ సినీ, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా శనివారం నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాలుగా నాటక, సినీ, టీవీ ఆర్టిస్టుగా, రచయితగా, దర్శకునిగా సేవలందిస్తూనే చిలకలూరిపేట కళాశాల అధ్యాపకుడిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలలో సుపరిచితునిగా పేరుగాంచారు. ముఖ్యంగా మార్టూరు కేంద్రంగా స్థానిక రోటరీ క్లబ్‌తో కలిసి శ్రీకారం రోటరీ కళాపరిషత్ అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాలుగా మార్టూరులో ఉభయ తెలుగు రాష్ట్రాలస్థాయిలో నాటిక పోటీలు నిర్వహించటంలో ఆయన కీలక భూమిక పోషించారు. డైరెక్టర్‌గా నియామకం పొందడం పట్ల శ్రీకారం కళాపరిషత్ కార్యదర్శి జాష్టి అనూ రాధ, ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జేవీ మోహన్ రావు, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాదల సాంబశివరావు, కోటేశ్వరరావు, శానంపూడి లక్ష్మయ్య, ఇంటూరి ఆంజనేయులు, రావి అంకమ్మ చౌదరి, బాపట్ల, పల్నాడు జిల్లాలలోని పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ