వినుకొండ: పట్టణంలోని పాత ఎల్‌ఐసి బిల్డింగ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్‌న్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రాన్‌న్స్‌ఫార్మర్ పేలిన వెంటనే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు అప్రమత్తమై, వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు.


