మంగళగిరిలో వృద్ధుడి..
మంగళగిరి టౌన్: వడదెబ్బకు గురై ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన యర్రబాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండల పరిధి యర్రబాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధుడు బత్తిని నరసింహారావు(78) గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యం పాలయ్యాడు. ఎండ వేడి తట్టుకోలేక వృద్ధుడు శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఆయనకు భార్య ఉంది.
భట్టిప్రోలు: హైవే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భట్టిప్రోలు మండలం సూరేపల్లికి చెందిన చిత్రలేఖనోపాధ్యాయులు పాలాటి నరసింహారావు (60) పడమటివారిపాలెంకు చెందిన విద్యార్థి మట్టా విఘ్నేష్‌ను బైక్‌పై ఎక్కించుకుని వెళుతున్నాడు. భట్టిప్రోలు వేమవరం మధ్యలో ఎన్‌హెచ్ 216 రహదారిపై టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ నరసింహారావును 108 వాహనంలో తెనాలి ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. స్వల్ప గాయాలైన విఘ్నేష్‌ను సంగంజాగర్లమూడిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సమాచారం మేరకు ఎస్‌ఐ ఎం.శివయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చీరాల: మండలం వాడరేవులోని సముద్రతీరానికి శుక్రవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహం కొట్టుకువచ్చిందని రూరల్ ఎస్‌ఐ ఎ.చంద్రశేఖర్ తెలి పారు. మృతుడి వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎడమచేతి ఉంగరం వేలుకు ఎరుపు రాయి కలిగిన బంగారపు ఉంగరం ఉందన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు చీరాల రూరల్ ఎస్‌ఐ 9121102144, చీరాల రూరల్ సర్కిల్ సీఐ 9121102143 నంబర్లుకు సంప్రదించాలన్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


