బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026 సూరీడు జిల్లాలో 44–48 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు కారంచేడు: వేసవి ఎండల తాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. బాపట్ల జిల్లాలో బుధవారం నుంచి రాబోవు 10 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ, జిల్లా రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల నుంచే వడగాలులు వీచాయి. దీంతో ఉద్యోగాలకు వెళ్లేవారు, చిరు వ్యాపారులు, వ్యవసాయ కూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అమృతలూరు, కారంచేడు, యద్దనపూడి, బాపట్ల, నగరం, వేటపాలెం, మార్టూరు, పిట్టలవానిపాలెం, చుండూరు, కొల్లూరు, ఇంకొల్లు, రేపల్లె, వేమూరు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, కర్లపాలెం, నిజాంపట్నం, చినగంజాం, చీరాల, పర్చూరు మండలలాల్లో 41 డిగ్రీల నుంచి 54 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ప్రమాదముందని అధికారులు ముందగానే హెచ్చరించారు. దీంతో అవకాశం ఉన్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కారంచేడులో గురువారం 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. సుమారు 9 గంటలకే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా తయారయ్యాయంటే తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కారంచేడులో చినవంతెన సెంటర్‌, స్టేట్‌ బ్యాంక్‌ సెంటర్‌, పెద బజారు సెంటర్‌, బందెలదొడ్డి బజారు, కాలువ సెంటర్‌, రంగయ్యపేట సెంటర్‌ల వద్ద చెట్లు వాటి కింద బల్లలుంటాయి. వాటి దగ్గర ఎంత ఎండ ఉన్నా గ్రామంలోని రైతులు అక్కడ చెట్ల నీడలో కూర్చోని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటుంటారు. గురువారం మాత్రం పై సెంటర్ల వద్ద ఏ ఒక్కరు కనపడలేదు. బయటకొస్తే నిప్పుల కొలిమిలో ఉన్నట్లు ఉందని పెద్దలు చెబుతున్నారు. తామింత వరకు ఇంతటి వేడిని చూడలేదని వారంటుంన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రామాల్లో రోడ్ల మీదకు ఎవరూ రావడం లేదు.

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం

శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026

పోలీసు జీపు డ్రైవర్‌ కొట్టడంతో పెట్రోల్‌

పోసుకొని బలవన్మరణానికి యత్నం

అప్రమత్తతతో అడ్డుకున్న వ్యక్తి

బంధువులు, పోలీసు సిబ్బంది

కారంచేడులో

45 డిగ్రీల మోత..

ఇదేమి టెన్షన్‌ గురు..!

నిర్మానుష్యంగా

చినవంతెన సెంటర్‌

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2542 టీఎంసీలు.

Advertisement
 
Advertisement
Advertisement