బాపట్లటౌన్: ప్రాపర్టీ నేరాలకు పాల్పడిన వారిపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్ గురువారం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను పరిశీలించి వాటికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసి, అసలైన బాధితులకు త్వరితగతిన అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నమోదైన దొంగతనం కేసుల రికవరీ పురోగతిపై ఆరా తీసిన ఆయన, రికవరీ శాతాన్ని మరింత పెంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని మొక్కలకు నీటిని అందించడానికి ఏర్పాటు చేసిన మోటార్, నీటి పంపింగ్ సిస్టంను ప్రారంభించి, ఆ పరిసరాలలో కొబ్బరి మొక్కను నాటారు. జిల్లాలో రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంన్నందున ప్రజలు, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఇన్‌స్పెక్టర్ పి.ప్రేమయ్య, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్


