ప్రత్తిపాడు: అప్పటి వరకూ నిప్పులు చిమ్మిన సూరీడుని ఒక్కసారిగా కారుమబ్బులు చుట్టేసి, చీకట్లు కమ్ముకున్నాయి. గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడుతో పాటు కోయవారిపాలెం, వట్టిచెరుకూరు మండలం ఐదవ మైలు, పుల్లడిగుంట, ఏటుకూరు.. ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి గుంటూరు–పర్చూరు పాతమద్రాసు రోడ్డులో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అప్రమత్తమైన విద్యుత్‌శాఖ అధికారులు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై భారీ వృక్షాలు అడ్డుగా పడిపోవడంతో గుంటూరు– బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల మధ్య కొంత సేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
ఈదురుగాలుల ధాటికి గుంటూరు – పర్చూరు పాతమద్రాసు రోడ్డులో నేలకొరిగిన భారీ వృక్షం


