వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు అరెస్ట్‌

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు అరెస్ట్‌

భట్టిప్రోలు: భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో 15 మంది దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సోషల్‌ మీడియా జాయింట్‌ సెక్రటరీ దాసరి కిరణ్‌ బాబును పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కిరణ్‌ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును వినియోగించుకున్నందుకు అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కిరణ్‌ అరెస్టును వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం దళితుల పక్షాన లేదని.. దళితుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని...ఈ ఘటన రుజువు చేస్తుందని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement