ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: టంగుటూరి ప్రకాశం పంతులు మార్గదర్శకత్వం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్సీ, ఆంధ్రకేసరి అభిమాన సంఘ గౌరవాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆంధ్రకేసరి అభిమాన సంఘ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్‌లోని ప్రకాశం చౌక్‌లో నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి లేళ్ల అప్పిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, పార్టీ సీఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ, పాపతోటి అంబేడ్కర్, షేక్ రోషన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, గీతా మందిరం చైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర యువజన నేత నూనె ఉమామహేశ్వరరెడ్డి, బందా శశి, పార్టీ నేతలు ఓర్చు శ్రీనివాసరావు, బైరెడ్డి రవీంద్రారెడ్డి, ఆలా కిరణ్, అరవ తిమ్మరాజు, చింతపల్లి రమణ, మన్నేపల్లి హనుమంతరావు, రెడ్డి కోటేశ్వరరావు, సింగు నరసింహారావు, సుందరరావు, సమీర్, శంకర్, వెంకటరెడ్డి, చిన్నా, వెంకటరమణ, సుశీలరావు, నీలి, ప్రసన్న, నారాయణ, విజయమాధవి, విజయమ్మ, రత్నకుమారి, దుర్గ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.


