గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలోని ఎన్‌న్‌జీవో హోంలో ఆల్ ఆంధ్రప్రదేశ్ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం గుంటూరు జిల్లా ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీజీవో గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బి.కృష్ణకిషోర్, సహా ఎన్నికల అధికారిగా గుంటూరు సిటీ కార్యదర్శి జీవీ కోటేశ్వరరావు, పరిశీలకునిగా జిల్లా కోశాధికారి ఎల్.శ్రీధర్ రెడ్డి వ్యవహరించారు. సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించి, వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా పి.కోటేశ్వరరావు (రెవెన్యూ), సహాధ్యక్షుడి వి రమేష్‌కుమార్ (వాణిజ్య పన్నుల శాఖ), ఉపాధ్యక్షులు బి వినోద్ చౌదరి (పశు సంవర్ధక శాఖ ), ఎం వెంకటేశ్వర్లు(డీఎస్‌ఓ ఆఫీస్ ), కార్యదర్శి ఎం సుధాకర్(వ్యవసాయ శాఖ), కార్యనిర్వాహక కార్యదర్శి ఎం రాణి (జలవనురుల శాఖ), సంయుక్త కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు (రహదారులు భవనాల శాఖ), వి.విజయ్‌ప్రసాద్ (జిల్లా కోర్టు), కోశాధికారిగా ఎం మల్లికార్జున నాయక్ (జల వనరుల శాఖ) ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్, ఏపీఎన్‌జిజీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో నాల్గవ తరగతి ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా, ఏపీ ఎన్జీజివో సంఘం తరఫున నాల్గవ తరగతి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీజిఓ జిల్లా కార్యదర్శి ఏ. శ్యాంసుందర్ శ్రీనివాస్, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్, కార్యదర్శి జి సుబ్బనారాయణ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుళ్లాయప్ప, ఏపీ ఎన్జీజీవో గుంటూరు సిటీ అధ్యక్షుడు సిహెచ్.కళ్యాణ్‌కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి నరసింహారావు, నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందించారు.


