పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై భారం | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై భారం

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

బాపట్ల: పెట్రో ధరలు పెంపుతో సామాన్యుడిపై పెనుభారం పడుతుందని వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య మండిపడ్డారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చల్లా రామయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచేదిలేదని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు ఉకదంపుడు ఉపన్యాలు చేసి గద్దెనెక్కారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కనీసం పన్నుల భారాన్ని కూడా అరికట్టలేకపోయ్యారని దుయ్యబట్టారు. ప్రజల వ్యతిరేకతను చవిచూడకముందే పెంచిన పెట్రో ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ గవిని కృష్ణమూర్తి, నాయకులు ఉరబిండి గోపినాధ్‌,శాయిల మురళి, తన్నీరు అంకమ్మరావు,కటికల యోహోషువా, వడ్డిముక్కల శామ్యూల్‌, దర్శి కళ్యాణ్‌,సన్నీ మహేంద్ర, పులి శ్రీనివాసరావు, ఆది వంశీ తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం

జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య

Advertisement
 
Advertisement
Advertisement