బాపట్ల: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించడం గర్వాంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. జిల్లాలోని మార్టూరు మండలంలో వి.ఆర్.ఓగా పని చేస్తున్న కుమార్ ఏప్రిల్ 17 నుంచి 20 వరకు థాయిలాండ్‌లోని శ్రీరాచా స్టేడియంలో జరిగిన పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించటంపై హర్షం వ్యక్తం చేశారు. షాట్‌పుట్, డిస్కస్‌త్రో విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి బాపట్ల జిల్లా పేరు ప్రతిష్టలను దేశ విదేశాల్లో చాటిన కుమార్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


