ఆధునిక జీవన శైలితో ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక జీవన శైలితో ముప్పు

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

వ్యాధి లక్షణాలు

గుంటూరు మెడికల్‌:

● గుంటూరుకు చెందిన సాగర్‌ కొంతకాలంగా తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఉద్యోగ రీత్యా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మేల్కోని ఉండటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో సమస్య తీవ్రవై గుంటూరు జీజీహెచ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్ష చేసి సాగర్‌ ఇన్‌ఫ్లామేటరీ బోవెల్‌ డిసీజ్‌ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

ఇన్‌ఫ్లామేటరీబోవెల్‌ డిసీజ్‌ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్న వారి సమస్య రోజురోజుకు ఎక్కువతోందని, సకాలంలో చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలం వ్యాధి వేధిస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మిలియన్లకంటే ఎక్కువ మంది వ్యాధి బాధితులు ఉన్నట్లు ది యూరోపియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ క్రోన్స్‌ అండ్‌ ఆల్సరేటీవ్‌ కొలిటీస్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టడం తప్ప పూర్తిగా నయం చేయలేరు. ఐబీడీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2010 నుంచి మే 19న ప్రపంచ వ్యాప్తంగా ఐబీడీ డే నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కారణాలు

ఐబీడీ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, జన్యుపరమైన కారణాలు, జీవన విధానం, కొన్ని రకాలమందులు మింగడం ద్వారా, పాస్ట్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వ్యాధి కారణాలు.

బాధితులు

15 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈవ్యాధిబారిన పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈవ్యాధి బాధితులే. కొంత మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడు వారంలో నలుగురు లేదా, ఐదుగురు ఐబీడీ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతిరోజూ ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధి భారతదేశంలో కూడా నేడు పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు.

నిర్ధారణ

ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎమ్మారై, రక్త పరీక్షలు, సిటీస్కాన్‌, మలహర్ష ద్వారా ఐబీడీ వ్యాధినిన ఇర్ధారిస్తారు.

ఐబీడీ వ్యాధిపై అవగాహన కలిగి

ఉండాలి

పాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే కట్టడి చేయవచ్చు

నేడు వరల్డ్‌ ఐబీడీ డే

క్రాన్స్‌ వ్యాధి, అల్సరేటీవ్‌ కొలిటీస్‌ వ్యాధులనే ఐబీడీ వ్యాధిగా పిలుస్తారు.వాంతులు, విరోచనాలు, కొన్ని సార్లురక్తపు విరోచనాలు, కడుపులో నొప్పి, అకస్మాత్తుగా శరీరం బరువును కోల్పోవడం, కడుపులో మంట, కడుపులో తిమ్మిరి, అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. వ్యక్తులను బట్టి వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement