అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

బాపట్లటౌన్‌ ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ప్రజలు అందించిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ హెచ్చరించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 45 మంది బాధితులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలు వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ తక్షణమే పరిష్కరించేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్‌ అధికారులతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బాధితుల సమస్యలను చట్టపరిధిలో విచారించి సత్వరమే పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రధానంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలకు సంబందించిన కేసులే అధికంగా వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సీసీఎస్‌ డీఎస్పీ పి.జగదీష్‌ నాయక్‌, పీజీఆర్‌ఎస్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

Advertisement
 
Advertisement
Advertisement