రిక్త హస్తం ఇప్పటికై నా మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వర్తించేనా! దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుంది చీరాల అర్బన్ : చంద్రబాబు మాటలు నీటి మూటలవుతున్నాయి. చేనేతల కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు నమ్మబలికారు. తొలి ఏడాది నేతన్న నేస్తం పథకం సొమ్ము ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారు. ఈ ఏడాది కూడా ఆ ఊసే లేదు. ఏప్రిల్ నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. నూలు, రంగులు, రసాయనాలు ధరలు ఇబ్బడి, ముబ్బడి పెరిగాయి. కొనుగోళ్లు తగ్గాయి. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ తమకు ఏ విధంగా సహాయ పడటం లేదని గత ఆదివారం మంగళగిరిలో జరిగిన చేనేత సదస్సులో ఆ రంగ ప్రతినిధులు గళం విప్పారు. ఈ క్రమంలో నేతన్నలు చంద్రబాబు తీరుపై గుర్రు మంటున్నారు. కనీసం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అయినా నిబంధనల పేరుతో కోతలు పెట్టకుండా మగ్గం ఉన్న ప్రతి ఒక్కరిని అర్హుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఉపవృత్తుల వారికి స్థానం కల్పించాలని కోరుతున్నారు.
● బాపట్ల జిల్లాలో ఏడు వేలకు పైగా మగ్గాలున్నాయి. అందరూ నిరుపేదలే. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చేనేత రంగానికి దన్నుగా నిలిచారు. నేతన్న నేస్తం పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అవి ఆయా కుటుంబాల అభ్యున్నతికి ఎంతో దోహదపడ్డాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఏడాదికి రూ.25వేలు చెల్లిస్తామని నమ్మబలికింది. నమ్మాం.. మోసపోయామని ఆ రంగానికి చెందిన పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
● హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయానికి అందిన దరఖాస్తులను నిర్ణీత ప్రక్రియ నేపథ్యంలో విద్యుత్‌శాఖ డీఈ కార్యాలయానికి అందజేస్తున్నారు. వాటికి సంబంధించి తుది పరిశీలన విద్యుత్ శాఖ కార్యాలయంలో జరుగుతోంది. వడపోతల తరువాత అర్హుల జాబితా ప్రకటిస్తారు. అయితే నిబంధనల వడపోతల పేరుతో అర్హుల జాబితాను కుదించవద్దని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
● మగ్గం ఉన్న చేనేత కార్మికులతో పాటు సమానంగా ఉపవృత్తుల వారికి అన్ని విధాలా లబ్ధి చేకూస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అయితే అది ఆచరణలో లేదు. దీంతో ఉపవృత్తుల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు రిక్తహస్తం చూపటం సరికాదంటున్నారు. తమకు సమప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమలు చేయలేకపోతే చెప్పటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
5,554 దరఖాస్తులు అందాయి
చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఇప్పటి వరకు 5,554 దరఖాస్తులు అందాయి. అందులో 4,474 దరఖాస్తుల పరిశీలన జరిగింది. మరో 1,080 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఇవాళ, రేపట్లో పూర్తి చేసి అర్హులైన వారి జాబితా విడుదల చేస్తాం.
200 యూనిట్లు దరిచేరేనా...
ఇప్పటికి 6,800 దరఖాస్తులు అందజేత
హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయం నుంచి 6,800 దరఖాస్తులను చేనేతలకు అందజేశారు. వాటిని మంగళవారం సాయంత్రం లోపు తిరిగి ఏడీ కార్యాలయంలో అందజేయాలని గడువు పెట్టారు. ఈ క్రమంలో ఇంకా కొంత మంది తమ దరఖాస్తులను అందజేయాల్సి ఉంది. వాటికి సంబంధించిన పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. వాటిలో కోతలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు మా కార్యాలయం నుంచి 6,800 దరఖాస్తులు చేనేతలకు అందజేశాం. మగ్గాలు కూడా కాస్త, అటుగా అన్నే ఉంటాయి. దరఖాస్తులను పూర్తి చేసి ఇచ్చిన వాటిని పరిశీలిస్తున్నాం. అంతిమంగా విద్యుత్‌శాఖ కార్యాలయంలో అర్హుల జాబితా తయారవుతుంది.
ఏప్రిల్ మాసం నుంచి మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. అందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జరుగుతోంది. గురువారంతో గడువు ముగుస్తుంది. మే నెలలో లబ్ధిదారులు ఎవరూ విద్యుత్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అందులో మగ్గం ఉన్న అందరూ ఉంటారా? నిబంధనల పేరుతో కోతల వాతలు పెడతారే అనే కోణంలో నేతన్నలు చర్చించుకుంటున్నారు.
చేతి వృత్తులకు
ఇప్పటికై నా మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వర్తించేనా!
దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుంది
● నేతన్న నేస్తంపై సమాధానమే కరవు
● నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు
● చంద్రబాబు ప్రభుత్వంపై
చేనేతలు గుర్రు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దన్నుగా నిలిచిన సీఎం జగన్
విద్యుత్ శాఖ కార్యాలయంలో తుది జాబితా
ఉపవృత్తుల వారికి ఏదీ ?
– జాన్ థామస్,
విద్యుత్‌శాఖ డీఈ, చీరాల
– రఘనందన్, హ్యాండ్లూమ్స్ ఏడీ, చీరాల