అండర్‌–19 యువకుల క్రికెట్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 యువకుల క్రికెట్‌ జట్టు ఎంపిక

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): గుంటూరు జిల్లా అండర్‌–19 యువకుల క్రికెట్‌ జట్టును ఎంపిక చేశామని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ త్రీమెన్‌ కమిటీ సభ్యుడు టి.శివకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న జట్టు ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు పేరేచర్ల మైదానంలో అంతర్‌ జిల్లాల అండర్‌–19 క్రికెట్‌ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

జట్టు సభ్యులు

జి.దేవ్‌ప్రమోద్‌(కెప్టెన్‌,వికెట్‌ కీపర్‌), ఎం.సమన్యుదత్త, కె.ఎన్‌.వి.కౌషిక్‌, వి.వెంకట రోహిత్‌, వి.రిత్విక్‌, కె.ఎస్‌.మణికంఠ, వై.శశాంక్‌రెడ్డి, టి.నాగసాయిచరణ్‌, ఎం.తులసి నందన్‌, ఎ.యోచన్‌, వి.డి.డింకు రామ్‌ చరణ్‌తేజ్‌, ఓ నాగూర్‌ అబ్దుల్‌ జబ్బార్‌, కె.ఆదిత్య శ్రీకర్‌, ఇ పృధ్వీ శ్రీనివాసరెడ్డి, ఎస్‌కె.మక్సూర్‌ ఇర్ఫాన్‌, డి.డేవిడ్‌ మెల్విన్‌. స్టాండ్‌ బైస్‌: ఎం.ఎస్‌.విజయ్‌, ఎస్‌కె.నాగుర్‌ బాషా, ఎస్‌కె ఎండీ గులాషన్‌ జమీల్‌ మోయిన్‌, వి.అభిషేక్‌, ఎస్‌కె అబ్దుల్‌ అజీజ్‌.

కాటన్‌ కన్సార్టియం బలోపేతానికి కృషి

–ఉప్పుటూరి సాంబశివరావు

కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌లో కాటన్‌ కన్సార్టియం కింద పనిచేస్తున్న జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ మిల్స్‌ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ కాటన్‌ టీఎంసీ మిల్స్‌ అసోసియేషన్‌ కన్సార్టియం నూతన అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక ఎస్‌వీఎన్‌ కాలనీలోని సమావేశ మందిరంలో సోమవారం అసోసియేషన్‌ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావుతోపాటు ఉపాధ్యక్షుడుగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా నల్లూరి గౌరీశంకర్‌, సహాయ కార్యదర్శిగా నేరెళ్ల ఏడుకొండలు, కోశాధికారిగా గుండా సాంబశివరావులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో ఏపీ కాటన్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు గోరంట్ల పున్నయ్యచౌదరి, వివిధ జిల్లాల ప్రతినిధులు తుమ్మల సాంబశివరావు, మల్లయ్య, జయ కాటన్‌ సుబ్బారావు, బుల్లెట్‌ సుబ్బారావు, మదమంచి రంగారావు, కె.గోపాలకృష్ణ, వెంకటరామిరెడ్డి, దశరథరామిరెడ్డి, కుబేర్నాథరెడ్డి, మొరహరిరెడ్డి పాల్గొన్నారు.

విద్యుత్‌ అధికారుల ఆకస్మిక తనిఖీలు

రూ.12.93 లక్షలు అపరాధ రుసుం వసూలు

కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్‌ శాఖ విజిలెన్స్‌, ఆపరేషన్‌ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్‌ సీహెచ్‌ రమేష్‌ ఆధ్వర్యంలో డీ–13 సెక్షన్‌ పరిధిలోని ఆటోనగర్‌, నవభారత్‌నగర్‌, ఆర్‌టీసీ కాలనీలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 54 మంది అధికారులు, 158 మంది సిబ్బంది 54 బృందాలుగా ఏర్పడి 4,489 సర్వీసులను తనిఖీలు చేశారు. అనుమతించిన లోడు కన్నా అదనంగా విద్యుత్‌ వాడుతున్న 183 మందికి రూ.12.16 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్‌ వాడుతున్న ఆరుగురికి రూ.52 వేలు, మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్న ఒకరికి రూ.25 వేలు మొత్తం కలిపి రూ.12.93 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎస్‌ఏ కరీమ్‌, ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పి.హుస్సేన్‌ ఖాన్‌లు మీడియాకు తెలిపారు. తనిఖీల్లో డీఈఈలు పి.రమేష్‌, ఎన్‌.మల్లికార్జున ప్రసాద్‌, కె.రవికుమార్‌, ఏఈఈలు వి.బాజీ, యు.శివశంకర్‌, ఎం.సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చిత్రకారుడు వల్లెం కృష్ణకు

అంతర్జాతీయ మెరిట్‌ జ్యూరీ అవార్డు

వినుకొండ: మండలంలోని గోకనకొండ గ్రామానికి చెందిన చిత్రకారుడు వల్లెం కృష్ణకు మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. డాక్టర్‌ కేపీ బాబు నేతృత్వంలోని క్రియేటివ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో కృష్ణ గీసిన చిత్రానికి అంతర్జాతీయ మెరిట్‌ జ్యూరీ అవార్డు, నగదు బహుమతి అందుకున్నారు. అవార్డు పొందిన కృష్ణను పలువురు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement