కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం బహిరంగ వేలం ద్వారా రూ.92.90 లక్షల ఆదాయం పొగాకు బోర్డు విశ్రాంత సీనియర్‌ అధికారుల ఆత్మీయ సమ్మేళనం కొరిటెపాడు: ఆల్‌ ఇండియా పొగాకు బోర్డులో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ చేసిన విశ్రాంత సీనియర్‌ అధికారుల ఆత్మీయ సమావేశం జీటీ రోడ్‌లోని ఇండియన్‌ టుబాకో అసోసియేషన్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. 1976 నుంచి 1984వ సంవత్సరం వరకు పొగాకు బోర్డులో నియమితులైన ప్రథమ శ్రేణి టెక్నికల్‌ ఆఫీసర్స్‌(సాంకేతిక అధికారులు) ఈ కార్యక్రమంలో పాల్గొని పొగాకు బోర్డు స్థాపనకు కారకులు అయిన వారిని గుర్తు చేసుకుని వారిలో దివంగతులు అయిన వారికి నివాళులర్పించారు. అంతేకాకుండా పొగాకు బోర్డు స్థాపనకు కారకులైన కొత్త రఘురామయ్య, వేలం వ్యవస్థ రావడానికి కారకులైన ఎంసీ మహాపాత్ర, ఇతర సంస్థాపకులను స్మరించారు. సమ్మేళనంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని విశ్రాంత అధికారులు మేదరమెట్ల శేషగిరిరావు, యు.వెంకట్రావు, వి.వీరారెడ్డి, స్థాపక్‌, వేణుగోపాల్‌, నరసింహా య్య, జయరాం పాల్గొన్నారు. సమ్మేళనాన్ని చక్కగా నిర్వహించిన పొగాకు బోర్డు పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మిత్ర, కె.రవికుమార్‌, తల్పసాయి, జి.ఉమామహేశ్వరరావు, వై.విజయ్‌కుమార్‌, వెంకటసుబ్బయ్యలను అభినందించారు. మంటలు చెలరేగి కారు దగ్ధం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహనశర్మను తాడేపల్లి పీహెచ్‌సీ సెంటర్‌కు వచ్చే సరికి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్మోహనశర్మ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదస్థలం నుంచి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన జగన్మోహన శర్మ మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై జగన్మోహన శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన శర్మ భౌతికకాయాన్ని దుర్గగుడి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు, అర్చకులు, సిబ్బంది సందర్శంచి నివాళులర్పించారు.

పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్‌ టెండర్‌ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్‌ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్‌), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్‌ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్‌), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్‌కుమార్‌), ఆలయం వద్ద సంచారంగా ఐస్‌క్రీమ్‌ విక్రయించుకునే లైసెన్స్‌ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్‌ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్‌ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్‌), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్‌ హక్కును పొందారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

కోడూరు: పార్కింగ్‌లో పెట్టిన కారులోమంటలు చెలరేగి కారు దగ్ధం అయిన ఘటన కోడూరులో సోమవారం చోటు చేసుకుంది. కోడూరుకు చెందిన షేక్‌ కరిముల్లా తన కారును రామకృష్ణా థియెటర్‌కు చెందిన ఖాళీ ప్రదేశంలో పెట్టారు. ఉదయం 10 గంటల సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి అహుతైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అవనిగడ్డ ఫైర్‌ అధికారులు వచ్చి మంటలు అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని కోడూరు ఎస్‌ఐ పరిశీలించి, వివరాలు సేకరించారు. కారుకు ఎవరైనా నిప్పుపెట్టారా, కారు లోపల నుంచి మంటలు వ్యాపించాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement