చెరుకుపల్లి: శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం ఆయా రామ మందిరాల వద్ద శనివారం సత్యనారాయణస్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన చేపట్టారు. మండల కేంద్రంలోని వీరరాఘవపేట రామ మందిరం, గుళ్లపల్లి శ్రీ కోదండ రామాలయం, అదే గ్రామంలో రజక సంఘం ఏర్పాటు చేసిన మండపం, బలుసులపాలెంలో కొనకాల రవికిరణ్ ఆధ్వర్యంలోని గ్రామ రామ మందిరం, పొన్నపల్లి, తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


