అవగాహన లేకనే... | - | Sakshi
Sakshi News home page

అవగాహన లేకనే...

Mar 28 2026 7:38 AM | Updated on Mar 28 2026 7:38 AM

అవగాహన లేకనే...

బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం బీచ్‌లతోపాటు, పర్యాటక రంగాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఆస్వాదించేందుకు వచ్చే ప్రయాణికులు రహదారిపై ఉన్న డైవర్షన్‌లు, అక్కడక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను కూడా గమనించడం లేదు. అవగాహన లేని ప్రయాణాలతోనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. పర్చూరు వైపు నుంచి వాడరేవుకు వచ్చే మార్గంలో కారంచేడు వద్ద సుమారు 5 కిలోమీటర్ల ముందుగానే రోడ్డు డైవర్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వలన ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కచ్చితమైన విజువల్‌ బోర్డులను ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చెయ్యాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement