8 కిలోల గంజాయి స్వాధీనం
బాపట్ల డీఎస్పీ పి. జగదీష్‌నాయక్
బాపట్లటౌన్: పూరి నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో బాపట్ల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా 70 గంజాయి చాక్లెట్లు, 8 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నామని బాపట్ల డీఎస్పీ పి. జగదీష్‌నాయక్ తెలిపారు. బాపట్ల డీఎస్పీ కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు గురువారం ప్రత్యేక బృందం పూరి నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో తనిఖీలు నిర్వహించామన్నారు. ఇందులో 8 కిలోల గంజాయి, 70 గంజాయి చాక్లెట్లను సీజ్ చేసి, అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒడిశా నుంచి వస్తున్న పున్నారెడ్డి, గౌతమ్ మాలిక్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రవికుమార్‌లను అరెస్ట్ చేశామన్నారు. వీరు వీటిని ఒడిశా నుంచి తీసుకువచ్చి ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నారన్నారు.
ముగ్గురు వ్యక్తులు అరెస్ట్


