ముస్తాబైన ఆలయాలు, ఏర్పాటైన చలువ పందిళ్ళు
రేపల్లె: శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాములోరి కల్యాణానికి నియోజకవర్గంలో పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. వివిధ కమిటీల ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే రామాలయాలను విద్యుత్‌ద్దీపాల అలంకరణతో దేద్దీప్యమానంగా ముస్తాబు చేశారు. రైలుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయం, రామకోటిపేటలోని కోదండరామస్వామి ఆలయం, నేతాజీనగర్‌లోని సీతారామాంజనేయస్వామి ఆలయం, పెద్ద పోస్టాఫీసు ఎదురు రోడ్డులోని రామాలయం సింగుపాలెం, కై తేపల్లి, పేటేరు తదితర గ్రామాలలోని రామాలయాలలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పట్టణంలో పాత స్టేట్ బ్యాంక్ వద్ద బాల భక్త బృందం, పెదకూరగాయల మార్కెట్‌లోని రామాలయం, మార్కెట్ సమీపంలోని వినాయక స్వామి ఆలయం వద్ద, ఇసుకపల్లిలో భారీగా చలువ పందిళ్ళు ఏర్పాటు చేసి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.


