వేమూరు: ఆస్తి వివాదంతో తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చుండూరు మండలంలోని మోదుకూరు గ్రామంలోని కందేపాడుకు చెందిన గండికోట నరసిహారావు రైల్వే శాఖలో గ్యాంగ్ మేన్‌గా పని చేసి పదవీ వివరమణ పొందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రవీంద్ర తన తండ్రిని సోమవారం రాత్రి హత్య చేశాడు. చుండూరు పోలీసు స్టేషన్‌లో తండ్రి కనిపించడం లేదని మంగళ వారం ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి రవీంద్రను అదుపులోకి తీసుకొని విచారించారు. తండ్రిని చంపినట్లు పోలీసులు వద్ద ఒప్పకున్నాడని ఎస్ ఐ చంద్రావతి బుధవారం తెలిపారు. అమృతలూరు మండలంలోని పంచాళవరం గ్రామంలోని పొలాల్లో ఉన్న బావిలో మృతదేహాన్ని పడవేసినట్లు చెప్పాడు. బావిలో శవం గుర్తించి బయటకు తీశామన్నారు. రవీంద్రపై కేసు నమోదు చేశారు.
చిలకలూరిపేట: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, మోడరన్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఈ తమ్మాజిరావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మాసీ, పీజీ వంటివి కలిగి ఉండి 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు గలవారు దరఖాస్తు చేయవచ్చన్నారు. విద్యార్హతను బట్టి జీతం రూ. 14,500 నుంచి రూ. 35 వేలు వరకు ఉంటుందన్నారు. ఉదయం 9 – సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 98487 93357, 77029 21219 ఫోన్ నంబర్లకు సంప్రదించాలన్నారు.


