రంజాన్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌కు సర్వం సిద్ధం

Mar 21 2026 5:01 AM | Updated on Mar 21 2026 5:01 AM

రేపల్లె: పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఈద్గాలను, మసీదులను నమాజులు నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. గత నెల రోజులుగా ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న రంజాన్‌ కఠోర ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో విరమించారు. శనివారం ఈద్‌–ఉల్‌–ఫితర్‌ (రంజాన్‌) ప్రత్యేక ప్రార్థనలకు ముస్లింలు సన్నద్ధమవుతున్నారు. రేపల్లె పట్టణంలోని పెనుమూడి రోడ్డులో ఉన్న తూర్పుజామియా మసీదు, పెద పోస్టాఫీసు సెంటరులోని పెదజామియా మసీదు, రామకోటిపేటలోని మదీనా మసీదు, లక్ష్మీ టాకీసు సెంటరులోని మర్కస్‌ మసీదు, జేఎల్‌బీ కళాశాల రోడ్డులోని అబూబకర్‌ మసీదు, నేతాజీనగర్‌లోని నసీరుద్దీన్‌ మసీదు, నగరం మండలం కట్టవలోని మదీనా మసీదుల, రేపల్లె పట్టణం ఉయ్యూరువారిపాలెం రోడ్డులోని ఈద్గా విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement