విశ్వాసులకు తప్పక విజయం | - | Sakshi
Sakshi News home page

విశ్వాసులకు తప్పక విజయం

Mar 8 2026 7:44 AM | Updated on Mar 8 2026 7:44 AM

అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తు మనకు అప్పగించిన పనిని పూర్తిచేస్తే విశ్వాసులను విజయం తప్పక వరిస్తుందని హోసన్నా మినిస్ట్రీస్‌ దైవజనులు పాస్టర్‌ రమేష్‌ అన్నారు. లేమల్లె హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్‌ నిర్వహించే 49వ గుడారాల పండుగ మూడవరోజు శనివారం రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాదిమంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మనం సమాజాన్ని ప్రభావితం చేయాలంటే క్రీస్తును స్తుతించటమే మార్గమన్నారు. తొలుత హోసన్నా మినిస్ట్రీస్‌ అధ్యక్షుడు ఫాస్టర్‌ అబ్రహాం, చీఫ్‌ పాస్టర్‌ జాన్‌వెస్లీ, రమేష్‌లు స్తుతి గీతాలాపన చేశారు. రెండవ వర్తమానంలో ఒంగోలుకు చెందిన పాస్టర్‌ రాజు మాట్లాడుతూ దేవుడిని సంపూర్ణసిద్ధితో ఆరాధించాలన్నారు. హోసన్నా మినిస్ట్రీస్‌ నిర్వహిస్తున్న బైబిల్‌ సెమినార్‌లో 2025లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు ప్రదానం చేశారు.

హోసన్నా మినిస్ట్రీస్‌

దైవజనులు పాస్టర్‌ రమేష్‌

Advertisement
 
Advertisement
Advertisement