పిచ్చికుక్క స్వైరవిహారం
పిడుగురాళ్ల: పిచ్చి కుక్క స్వైర విహారంతో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని చింతల శృతి అనే చిన్నారి స్థానిక హైస్కూల్ సమీపంలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి ముఖంపై గాయపరిచింది. మరో చిన్నారిని వీపుపై గాయం చేసింది. ఇద్దరు చిన్నారులకే కాకుండా అటుగా వెళ్లే ఇద్దరు మహిళలతోపాటు ఎస్సీ కాలనీకి చెందిన వంగపూరి హారిక మెడ బాగాన, వీపు బాగాన గాయపరిచింది. వీరితోపాటు బీసీ కాలనీకి చెందిన మరో ఇద్దరిపై దాడి చేసి కలవర పరిచింది. మొత్తం ఆరుగురికి గాయాలు అయ్యాయి.
ఆరుగురికి గాయాలు
పిచ్చికుక్క స్వైరవిహారం


