పదిలో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి
వినుకొండ: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు, అత్యున్నత ర్యాంకులు లక్ష్యంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో పీవీజే రామారావు పాల్గొని మాట్లాడుతూ పరీక్షలకు మిగిలి ఉన్న 45 రోజుల సమయాన్ని విద్యార్థులు అత్యంత కీలకంగా భావించాలని సూచించారు. లక్ష్యంతో, సరైన ప్రణాళికతో చదివి రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈవో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవోలు జఫ్రుల్లా, కె.పార్వతి, జి.చిన్నపరెడ్డి, ఎం.సాంబశివరావు, ఎన్. రవిచంద్ర, ఎ.లలిత కుమారి, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట డీఈఓ రామారావు


