చైర్మన్‌కు కనీస పరిజ్ఞానం కూడా లేదు
చైర్మన్‌కు కక్ష సాధింపు ధోరణి తప్ప కనీస పరిజ్ఞానం కూడా లేదు. డిసెంబరు 20వ తేదీ కౌన్సిల్ సమావేశం జరిగింది. మార్చి 17తో మా పదవీ కాలం పూర్తవుతుంది. అయితే 3నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే మా పదవీ కాలం పూర్తయిన తరువాత కూడా మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం ఆయనకుందేమో ఆయనకే తెలియాలి. మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టు స్టే ఇచ్చింది. నిబంధనలను పాటించమని చెప్పడం, అవినీతిని ప్రశ్నించటం మాత్రమే మేం చేసిన తప్పుగా చైర్మన్ ధరోణి ఉంది.
–బత్తుల అనీల్, 29వ వార్డు కౌన్సిలర్, చీరాల


