కౌన్సిల్‌లో ఒక మాట...బయట మరో మాట! | - | Sakshi
Sakshi News home page

కౌన్సిల్‌లో ఒక మాట...బయట మరో మాట!

Jan 28 2026 7:02 AM | Updated on Jan 28 2026 7:02 AM

కౌన్సిల్‌లో ఒక మాట...బయట మరో మాట!

కౌన్సిల్‌లో ఒక మాట...బయట మరో మాట!

● వైఎస్సార్‌ సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ల సస్పెన్షన్‌పై మాట మార్చిన వైనం ● కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు ● స్టే మంజూరు చేసిన కోర్టు ● మార్చి 17వ తేదీతో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం స్టే ఇచ్చిన విషయం తెలియదు

చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ వింతపోకడలు

చీరాల అర్బన్‌(చీరాల): చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ మించాల సాంబశివరావు వైఖరి వివాదాస్పదంగా తయారైంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉందనే ధీమాతో చైర్మన్‌గా ఎన్నికై న మించాల అప్పటి నుంచి చేపట్టిన చర్యలు అందుకు నిదర్శఽనంగా నిలుస్తున్నాయి. గత నెల 20వ తేదీన కౌన్సిల్‌ సమావేశంలో జరిగిన పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. కౌన్సిల్‌లో చెప్పిన మాటలకు విరుద్ధంగా నిర్ణయాలు వెలువరించి చైర్మన్‌ వివాదస్పదంగా మారారు. కౌన్సిల్‌లో జరిగిన పరిణామాల క్రమంలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ బత్తుల అనీల్‌ను ఒక నెలపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. తర్వాత అనీల్‌తోపాటు మరో కౌన్సిలర్‌ గుంటూరు ప్రభాకరరావును కూడా కలిపి ఇద్దరిని మూడు నెలలపాటు కౌన్సిల్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ప్రజా సమస్యలపై మాట్లాడడమే నేరమా?

వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లుగా ప్రజా సమస్యలపై ప్రస్ఫుటంగా గళం విప్పటం, టీడీపీ అవినీతి చర్యలను ఎండగట్టటమే సస్పెన్షన్‌కు కారణంగా పట్టణ వాసులు భావిస్తున్నారు. మార్చి 17వ తేదీతో పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కౌన్సిల్లో ప్రశ్నించే గొంతులుగా గుర్తింపు పడ్డ ఆ ఇద్దరినీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్‌ చేశారని చర్చించుకుంటున్నారు.

స్టే మంజూరు చేసిన కోర్టు

వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు బత్తుల అనీల్‌, గుంటూరు ప్రభాకరరావులు చైర్మన్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తమను సస్పెండ్‌ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో జనవరి ఆరో తేదీన సస్పెన్షన్‌పై కోర్టు స్టే ఇచ్చిందని కౌన్సిలర్లు తెలిపారు.

ఈ నెల కౌన్సిల్‌ సమావేశం జరిగేనా..!

జరుగుతున్న పరిణామాల క్రమంలో ఈ నెల కౌన్సిల్‌ సమావేశఽం జరుగుతుందా లేదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు పదవి ఉన్నంత కాలంలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే కోణంలో ముందుకు సాగుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తంపై ఇరువురు కౌన్సిలర్ల సస్పెన్షన్‌పై కోర్టు స్టే ఇవ్వడంపై మున్సిపల్‌ కమిషనర్‌ కోర్టుకు వెళ్లారనే ప్రచారాలపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లో కూడా చర్చ నడుస్తోంది.

వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లపై విధించిన సస్పెన్షన్‌పై కోర్టు స్టే ఇచ్చినట్లు తనకు తెలియదు. అయితే అందుకు సంబంధించి మున్సిపాలిటీ పరంగా కూడా న్యాయపరమైన అడుగులు వేస్తున్నాం.

–డానియేల్‌ జోసఫ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement