ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి
‘ఎత్తిపోతల’కు భూ సేకరణ తప్పదు
49.56 శాతం పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్
రాష్ట్ర సచివాలయంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ మ్యాపింగ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – 2026 కోసం సన్నాహక కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ 49.56 శాతం పూర్తి చేశామన్నారు. డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
నేడు దివ్యాంగులకు పీజీఆర్‌ఎస్
జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, గిరిజనులకు ప్రత్యేకంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల చివరి శుక్రవారం ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి రావాలంటే భూ సేకరణ తప్పనిసరిగా జరగాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలు అనుసరించి రైతులకు మేలు చేయడానికే యంత్రాంగం ఉందన్నారు. 340.23 ఎకరాల భూ సేకరణ పెండింగ్‌లో ఉందన్నారు. కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామం పరిధిలో భూ సేకరణకు 2011లోనే అధికారికంగా ప్రకటన జారీ అయ్యిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ఆధారంగా నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోర్టును ఆశ్రయించడంతోనే పెండింగ్‌లో ఉందన్నారు. రైతుల అభిప్రాయాలను సేకరించి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. సబ్‌కలెక్టర్ విజయ జ్యోతికుమారి, రైతులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


