నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక
తాడికొండ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజధానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌లు తెలిపారు. తుళ్లూరు పరిధిలోని నేలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను వారు పరిశీలించారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏపీ సీఆర్డీఏ కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల అధికారులతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి హాజరు కానున్నారని అధికారులు తెలిపారు.
తెలుగు మహాసభలకు ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు నగరంలో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహను ఆహ్వానించినట్లు పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం జస్టిస్ శ్రీ నరసింహను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన గజల్ శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభల ప్రారంభోత్సవానికి సతీసమేతంగా వచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించారని తెలిపారు.
పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు
ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరగనున్న పీజీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేపట్టినట్లు గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఏఎన్‌యూలో స్పాట్ అడ్మిషన్‌లు జరగకుండానే మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ప్రకటించిన సీఈఓ పేరుతో ఈ నెల 26వ తేదీన సాక్షిలో కథనం వెలువడింది. దీంతో సీఈఓ ఆలపాటి మాట్లాడుతూ అన్ని పరీక్ష పేపర్లకు ఫీజు రూ.980 చొప్పున డిసెంబర్ 1వ తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్షలు డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించిన నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ఫైరింగ్ సమయంలో వేటకు వెళ్లొద్దు
బాపట్ల టౌన్: ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఫైరింగ్ చేసే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. గురువారం బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బాపట్ల మండలం సూర్యలంక, పాండురంగాపురం గ్రామాల్లో మత్స్యకారులు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వేటకు వెళ్లరాదన్నారు. సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ నుంచి మిసైల్ ఆపరేషన్ జరుగుతుందని వివరించారు.
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి రాక


