తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
చందోలు(కర్లపాలెం): కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజక వర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతులకు సంతాపంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రాత్రి చందోలు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రఘుపతి మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా సక్రమంగా ఏర్పాట్లు చేయకపోవటం ప్రభుత్వ తప్పిదమేనని చెప్పారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పిట్టలవానిపాలెం మండల అధ్యక్షుడు ఉయ్యూరి లీలాశ్రీనివాసరెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు షేక్ మౌలాలీ, జిల్లా అధ్యక్షుడు కొక్కిగడ్డ చెంచయ్య, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మాధవి, జిల్లా అధ్యక్షురాలు ఏట్ర అశ్వనీరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అహ్మద్ హుస్సేన్, ఎంపీటీసీ రాజు, మండే విజయ్‌కుమార్, బడుగు ప్రకాష్, దొంతిరెడ్డి కోటిరెడ్డి, యూత్ మండల కమిటీ సభ్యులు మణికంఠ, సిలార్, అన్వరీ, ఇమామ్, హిషార్, గిరీష్ తదితరులు ఉన్నారు.


