చాంపియన్ ఆఫ్ చాంపియన్ ్సగా విక్రమ్
గుంటూరువెస్ట్(క్రీడలు):గుంటూరు డిస్ట్రిక్ట్ ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన 2వ ఓపెన్ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్–2025 చాంపి యన్ ఆఫ్ చాంపియన్స్‌గా విక్రమ్(వైజాగ్) ని లిచాడు. మోస్ట్ మస్క్యూలర్ మ్యాన్‌గా నాగేంద్ర(తణుకు), బెస్ట్ పోజర్ ఆఫ్ ది టోర్నీగా భాస్కర్ (వైజాగ్) నిలిచారు. అసోసియేషన్ కార్యదర్శి గౌతమ్, కోశాధికారి జావెద్‌లు మా ట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేసిన బాడీబిల్డర్లతోపాటు స్పాన్సర్స్‌కు కృతజ్జతలు తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని పోటీలు నిర్వహిస్తామన్నారు. ఔత్సాహిక బాడీబిల్డర్స్ ను ప్రోత్సహించడమేప్రధాన ఉద్దేశమని చెప్పా రు. విజేతలకు లలితా హాస్పటల్స్ అధినేత కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవశర్మ, మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ లాల్‌వజీర్, గౌతమ్, జావెద్‌లు అందజేశారు.


