వైభవంగా రామలింగేశ్వర స్వామి శతాబ్ది ఉత్సవాలు
బాపట్ల: బాపట్లలోని శ్రీ గంగా పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి శతాబ్ది ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే వేద పండితుల ఆధ్వర్యంలో వేడుకలను ప్రారంభించారు. యాగశాల ప్రవేశం, రుద్ర శత చండీ హోమం నిర్వహించారు. వినాయక స్వామి వారికి లక్ష ఉండ్రాళ్ల పూజలు, 500 మంది మహిళలచే కోటి కుంకుమార్చన చేపట్టారు. బ్రహ్మశ్రీ తాళ్లపాక మణికంఠ శివాచార్యస్వామి యాజ్ఞీక పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి, చిట్టిబాబు, సాయివెంకట్, కౌండిన్య, నెమలికంటి హనుమంతరావు అర్చక సహకారంతో ఆలయ ధర్మకర్తలు ఆదూరి హరినారాయణ, కర్లపాలెం నాగేంద్ర పర్యవేక్షించారు. వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు మాజీ ఎంఎల్‌సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. టీటీడీ ఆస్థాన ప్రవచనకర్త ఆకెళ్ల విభీషణశర్మ ప్రవచనం నిర్వహించారు.
వైభవంగా రామలింగేశ్వర స్వామి శతాబ్ది ఉత్సవాలు
వైభవంగా రామలింగేశ్వర స్వామి శతాబ్ది ఉత్సవాలు
వైభవంగా రామలింగేశ్వర స్వామి శతాబ్ది ఉత్సవాలు


