అమరేశ్వరుని హుండీ ఆదాయం
అమరావతి:అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీలలోని కానుకలను లెక్కించారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వా మి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దాసరి చంద్రశేఖరరావు సమక్షంలో 12 హుండీలను తెరచి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు నెలల 7 రోజుల కాలానికి దేవాలయంలో ఉన్న హుండీల ఆదాయం మొత్తం రూ. 20,07,999. అన్నదాన మండపంలోని హూండీ ద్వారా రూ.48, 809 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ తెలిపారు.
19న త్రిపురనేని రామస్వామి పురస్కార ప్రదానోత్సవం
గుంటూరు ఎడ్యుకేషన్ : తెలుగు సమాజంలోని గొప్ప సామాజిక విప్లవకారుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 19న సాయంత్రం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. 2025వ సంవత్సరానికి రామస్వామి చౌదరి పురస్కారాలను సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, రాజకీయ, సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ మూకిరి సుధ, వీసీకే పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు కై లా జయసుధ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ – జాషువా – పూలే – పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్ పాల్గొన్నారు.
నేటి నుంచి కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సమ్మె
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్‌ఎం గ్రేడ్ –2ల సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం కమిటీ జనరల్‌బాడీ సమావేశం రామ్‌ప్రభాకర్, జి.నాగరాజుల అధ్యక్షతన జరిగింది. చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ నాగబ్రహ్మచారి, జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు సుబ్బారెడ్డి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని, దీనికి పూర్తిగా యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాయకులు జానీ, పవన్, రాంబాబు, వంశీ, అందే రాజేష్, కొండా, చంద్రశేఖర్ ఆచారి పాల్గొన్నారు.
స్రైయిట్‌కట్ సీమౌత్ తీరంలో సర్వే
స్రైయిట్‌కట్ సీమౌత్ తీరంలో సర్వే