
చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ మృతి
బాపట్ల టౌన్: చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని అసోదివారిపాలెం గ్రామానికి చెందిన సర్వింగ్ సోల్జర్ అసోది గోపిరెడ్డి(35) సెప్టెంబర్‌లో సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. సెప్టెంబర్ 29న చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని సికింద్రాబాద్ మిలటరీ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి పంపించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు తెలిపారు. బుధవారం గోపిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.