
కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బాపట్ల టౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని జిల్లేళ్లమూడిలో గల అనసూయాదేవి అమ్మవారు బుధవారం గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీ కాలనీలో సనాతన హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాత్యాయనిగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చందోలు బగళాముఖి అమ్మవారు శరన్నవ రాత్రుల్లో మూడవ రోజు కాత్యాయనీ దేవిగా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పసుపుకుంకుమలు సమర్పించి పూజలు చేశారు. తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.

కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు

కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు