
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి
బాపట్ల: జాతీయ ఉపాధి హామీ పథకం కింద ముమ్మరంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకం, జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ సేవలు, స్వామిత్వ, స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో పనులు చేపట్టాలని సూచించారు. జిల్లాలో స్వామిత్వ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో జి.ఎస్. డబ్ల్యూ.ఎస్ సేవలను పెండింగ్ లేకుండా సత్వరమే ప్రజలకు అందించాలని ఆయన చెప్పారు. మనమిత్ర క్యాంపు మరియు ఆధార్ సీడింగ్ వాహనాల లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. కర్లపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అభివృద్ధి పనుల అమలులో వెనుకబడి ఉన్నారని పద్ధతి మార్చుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జి.ఎస్ బ్ల్యూ.ఎస్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
పరిపాలనలో పారదర్శకంగా ఉండాలి
బాపట్ల: జిల్లా యంత్రాంగం పరిపాలనలో పారదర్శకంగా, నాణ్యతతో పని చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ కోరారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో కలెక్టర్ కార్యాలయ పీజీఆర్‌ఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా పరిపాలనలో అన్ని విభాగాలలో ర్యాంకింగ్‌లో మొదటి మూడు వరుసలలో ఉండే విధంగా సిబ్బంది పని చేయాలని చెప్పారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఏమైనా సమస్యలు ఉంటే సత్వర పరిష్కార చర్యల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, డీఆర్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి నాగిరెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లికార్జున రావు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టరు వినోద్‌కుమార్