
సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై అవగాహన
కొల్లూరు: కృష్ణా నదికి వరద పెరగనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం పోతార్లంక శివారు రావిలంక వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ జానిక అమరవర్ధన్ సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు. అక్కడ నివసిస్తున్న కుటుంబాలు తమ వద్ద అందుబాటులో ఉన్న పడవల సాయంతో కృష్ణా జిల్లా వెలివోలు, నడకుదురు ప్రాంతాలకు వెళ్తామని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జీవాలు, పశువులను తమ వద్ద ఉన్న పడవల ద్వారా నదిని దాటించడం కష్టమని అధికారుల దృష్టికి తీసుకురావడంతో మంగళవారం పెద్ద బోట్లను ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.