
కరకట్ట గండిని పరిశీలించిన కలెక్టర్
ఓలేరు(భట్టిప్రోలు): కృష్ణా నది పరీవాహక లంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. బాపట్ల జిల్లా పరిధిలోని భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో మళ్లీ కరకట్ట దెబ్బ తినకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట రేపల్లె ఆర్డీఓ ఎన్.రామలక్ష్మి, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, భట్టిప్రోలు తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్‌పర్సన్ పరుచూరి రమేష్ ఉన్నారు.